Saturday, September 30, 2017

కుల గర్జన కాదు కుల గజ్జి ఇది
కలి కాలము కాదు కుల కాలము ఇది
కళకు కొలతలు లేవు
కళకు అవధులు లేవు
ఒకరి కోసము కాదిది
ఇంకొకరి  కోరిక కాదిది
ప్రకృతి రంగులలో ఒకటిది
నీ ప్రకృతి అదే కళైనది
పాట ఆట మాట మౌనం
నిన్ను  నీలా చూపేది
నీకు నిన్ను చూపించేది
కళ అది

    - అహం బ్రహ్మాస్మి

Monday, August 28, 2017

ఎన్నాళ్లని రా ఈ బలులు
మేలుకోరా ఇక చాలు
నా దేశం నా దేశం అంటావు
నా దేశం కానిది లోకం కాదా
నా దేశంలో లేనివారు మనుషులు కారా
దేశానికి దేశానికి అడ్డు మనుషులే రా
దేశానికి దేశానికి అడ్డు ఆ  మనిషిలో అహమేరా
రంగు వేరు రూపు వేరు
పేరు వేరు పలుకు వేరు
మనిషి మాత్రం ఒకటే రా
మనిషి అసలు స్వరూపం ప్రేమే రా
నమ్మి చూడు ప్రెమించి చూడు
అప్పుడు హద్దులు లేని ఒక దేశం అవతరిస్తుంది చూడు

- అహం బ్రహ్మాస్మి

Saturday, August 26, 2017

ప్రేమించిన పని చెయ్యాలా
చేసే పనిని ప్రేమించాలా
ప్రేమించి పెళ్లి చేసుకోవాలా
పెళ్లి చేసుకొని ప్రేమించాలా

ఏమో తెలియదు నాకు
ఏది అసలైన దిక్కు

అసలు ప్రేమకు అది ఇది ఏమిటి
అసలు ప్రేమకు ఆడ మగ ఎమిటి
అసలు ప్రేమకు , పెళ్ళికి సంబంధం ఎమిటి
హద్దులు లేనిది కాదా
అడ్డులు తెలియనిది కాదా

- అహం బ్రహ్మాస్మి 
నాలా బ్రతకాలంటే నేనై పుట్టాలి
నన్నే గెలవాలంటే నేనై ఆడాలి
నా బ్రతుకు పుస్తకానికి నేనే అన్నీ
నా జీవిత రహదారిలో నేనే ఒక ఒంటరిని
వేరు వాడి వైపు చూడకు రా చూడకు
వాడి పరుగు వాడిదే నీ నడక నీదే

- అహం బ్రహ్మాస్మి 

Sunday, August 13, 2017

ఒక్కడినే నేనొక్కడినే నేనే వాడిని ఒక్కడినే
రాతిని కొట్టి రూపము చెక్కి రంగులు పూసే వస్తున్నా
వస్తూ వస్తూ చూసా శిల్పము చాలా ఉంది నాలాగ
రూపము నేనే రంగూ నేనే ఎత్తూ బరువు అన్నీ నేనే
ఇంకో నాలుగు అడుగులు వేసా మళ్ళీ చూసా శిల్పమునే
ఏడుస్తుంది నన్నే చూసి నేను విరగ్గొట్టిన తన రాతిని చూసి
విప్పలేని నోటితో కార్చలేని కన్నీటితో ఆర్తితో అడిగింది
ఎందుకు ఈ స్వార్ధమని

-అహం బ్రహ్మాస్మి

Thursday, July 20, 2017

ఏదో కావాలని ఆశపడకు
ఏదీ రాలేదని బాధపడకు
ఎంత వచ్చినా వదలననకు
ఏది ఇచ్చినా నాది అనకు

-అహం బ్రహ్మాస్మి 

Sunday, July 16, 2017


వస్తున్నా వస్తున్నా యుగపురుషుడను నేను ..

చీకటి రాజ్యపు కోటలు దాటి
కాలపు కాటుక మనసున చెరిపి
వజ్రపు వెలుగుల నేటి లోకంలోకి
ముళ్లను ఓడలుతో నవ్వుతు ఢీకొని
మెత్తని పూవుల  సొగసుని పొగిడి
చేతులలో ఆయుధమే లేదు
గుండె నిండా ఆనందం తప్ప ..

వస్తున్నా  వస్తున్నా యుగపురుషుడను నేను ..


-అహం బ్రహ్మాస్మి

Saturday, July 8, 2017

చీకటి బ్రతుకులు మావి చిన్న దీపము కూడా లేదు
ఈ మాయా లొకంలో.. మసకబారిన చూపుతో
ఎటు పొయేది ఎలా పొయేది
అందరిది ఇదే గతి .. మైకం లో ఉన్న మతి
రారా చిన్నన్నా చేయి పట్టి నడుద్దాం
కలసి కదిలి మనస్తత్వాన్ని ఎరుగుదాం ..

- అహం బ్రహ్మాస్మి 

Sunday, July 2, 2017

మేకప్ మొకాలు లిప్స్టిక్ పెదాలు
ఎంతో మేలు ఎంతో మేలు
ముసుగుల బతుకుల కపటము కన్నా
ఎంతో మేలు ఎంతో మేలు
విషయము దాచు మనిషి కన్నా
విషము ఉన్న పాము మిన్న
ఇలా ఎన్ని పద్యాలు రాసుకున్నా
ఫలితము మాత్రం నిండు సున్నా ..

                                   - అహం బ్రహ్మాస్మి 

Sunday, June 18, 2017

మాసిన గెడ్డం , అరిగిన చెప్పులు
చిరిగిన చొక్కా , నలిగిన లుంగీ
నాలుగు రోజులు తిండే లేదు
ఐదవ రోజుకి  ఆకలి లేదు
కడుపు మండే  , మోకాలు వణికే
నోరు ఎండే , కళ్లు తిరిగే

కడుపు నింపగా దేవుడు రాడు
నిస్సహాయ స్థితిలో మనిషి వీడు ..

-అహం బ్రహ్మాస్మి

Sunday, June 11, 2017

నను చూడని నీ కనులు నా కలలను శాసిస్తుంటే

నిను చూసిన నా కలలు నన్నే మరపిస్తుంటే

ఆ వర్షము ఊరించెనే
మనము తడవని చినుకులు ఇవిగో  అని

ఈ ఎండలు ఏడిపించెనే
తోడు నీడగా నీవు లేవని

ఇక చాలు ఈ దూరము ..
నిజమవ్వాలి మన ప్రేమము ..

- అహం బ్రాహ్మాస్మి 

Saturday, May 27, 2017

ఓ మనసా నా మనసా

విరామం నీకు తెలుసా
ఎందుకే చేస్తావు నానా రభస

నా మాటలు నీకు అలుసా
నిన్ను అర్థం చేసుకోలేదేమో నేను  బహుశా

ఓ మనసా నా మనసా

-అహం బ్రహ్మస్మి



Sunday, May 14, 2017

నడుస్తా నడుస్తా నడుస్తూనె ఉంటా
రాళ్లున్నా నీళ్లున్నా నడుస్తూనె ఉంటా
దుమ్ము పట్టిన కాళ్ళని చూడు గర్వంగా చెప్తాయ్
నేను పట్టిన పట్టు వెనక కధలన్నిటిని
కాయ కాసిన పాదాలనడుగు బిగ్గరగా చెప్తాయ్
నేను పడ్డ కష్టాన్ని ..నేను చూసిన సుఖాన్ని
నడుస్తా నడుస్తా నడుస్తూనె ఉంటా
అలలున్నా వలలున్నా నడుస్తూనె ఉంటా
బ్రతుకు బాటసారిని నేను నడుస్తూనె ఉంటా
                                                                      - అహం బ్రాహ్మాస్మి

Monday, May 1, 2017

ఆపేసాను ఆపేసాను నా కళ్ళల్లో నీళ్ళని
గట్టిగా ఊపిరి తీసుకొని ఆపేసాను
నా కన్నీళ్ళన్నిటిని
గుండెల్లో బరువుని ఉండని ఉండని
కళ్ళల్లో తడిని అలానే నిండని
అప్పుడే ప్రేమకు ప్రాణం ఉంటుంది
అప్పుడే బాధకు అర్ధం ఉంటుంది
వెళ్ళిపో నన్ను విడిచి నన్నే కాదని
అయినా ఉంటాను నిన్నే తలచుకుని...నిన్నే తలచుకుని..

Friday, April 21, 2017

ఆస్తికుడిని  కాదు నాస్తికుడిని కాదు
నేను నేనే నేను నేనే
నాయకుడిని కాదు సైనికుడిని కాదు
నేను నేనే నేను నేనే
మంచివాడిని కాదు చెడ్డవాడిని కాదు
నేను నేనే నేను నేనే

నన్ను నేనుగా చూడు .. నన్ను నేరుగా చూడు
అప్పుడే తెలుస్తుంది నేను ఎవరిననేది ..నేను  నేనే  నేను నేనే ..

                    - అహం బ్రహ్మాస్మి

Friday, April 14, 2017

నిలదియ్యరా నిన్ను  నిలదియ్యరా
నిన్ను నువ్వే ప్రశ్నించి నిలదియ్యరా
చూసీ చూడనట్టు నిన్ను చూడకురా
ధైర్యంగా నిలబెట్టి నిన్ను నిలదియ్యరా
అప్పుడే ఆగుతుంది ఈ అంతర్యుద్ధం
అప్పుడే ముగుస్తుంది ఆ బాహ్య యుద్ధం    ..ఇది తధ్యం

                                                 - అహం బ్రాహ్మాస్మి 

Saturday, April 8, 2017

ఆపెయ్  ఆపెయ్ పరుగులు ఆపెయ్
చక్కగ  నించొని చూడర  ఆపై

అపుడో  ఎపుడో కాదుర జీవితం
నేడే నేడే  నిజముర ఇది నిజం

రేపటి భయమే నేటికి సమాధి
అరెరె మరువకు అదే గతి రేపటిది

                        -అహం బ్రహ్మాస్మి 

Tuesday, March 14, 2017

గీసాం గీసాం గీతలు గీసాం
నీది నాది అని రాతలు రాసాం
ఏది ఏది ఆ నీది ఏది
అందరికీ కానిది ఎందుకు ఆ నీది
మానవత్వానికి హద్దులు లేవే
ప్రేమ తత్వానికి అడ్డులు లేవే
చెరిపేయ్ చేరిపేయ్ ఈ గీతలు చెరిపేయ్
కనిపించని సంకెళ్లను నీ కళ్ళు తెరిచి తెంపేయ్

                               -అహం బ్రహ్మాస్మి 

Sunday, February 26, 2017

ఏదో ఉన్నాం ఏదో పోయాం
చూస్తాం చూస్తాం చూస్తూ చస్తాం
కదిలించని చూపు ఎందుకు చెప్పు
కదలిరాని చేయి అది రాయి

సోదరా సోదరా శోధించరా
అక్కడా ఇక్కడా అది నువ్వేరా

స్వార్ధమై పోకు రా ఓ సోదరా
ధైర్యమై సాగరా నువ్వు మనిషిరా

                      - అహం బ్రహ్మాస్మి