నా చెవిన నీ గానము నర్తించిన వేళ
నీ భక్తి నా ఆత్మను మేల్కొల్పిన వేళ
నా కంటి నీరు నీ పాట పద్మములను కడిగిన వేళ
నీ ఆరాధన నా దేవునికి దారి వేసిన వేళ
నా ఆలోచనలు నీ స్వరములో సేదతీరిన వేళ
నీ కంటము నా దు:ఖమును కరిగించిన వేళ
తల్లీ !! వ్యక్తిగా నువ్వు లేని ఈ చోట..ఆత్మగా
ఉన్నది నీ పాట..
అటువంటి సరస్వతీ స్వరూపమునకు ఈ భక్తుడి ద్వారా ఈ
రచనాంజలి...
-అహం
బ్రహ్మాస్మి.
No comments:
Post a Comment