Saturday, February 15, 2014

Amma MS Subbulakshmi



నా చెవిన నీ గానము నర్తించిన వేళ

నీ భక్తి నా ఆత్మను మేల్కొల్పిన వేళ

నా కంటి నీరు నీ పాట పద్మములను కడిగిన వేళ

నీ ఆరాధన నా దేవునికి దారి వేసిన వేళ

నా ఆలోచనలు నీ స్వరములో సేదతీరిన వేళ

నీ కంటము నా దు:ఖమును కరిగించిన వేళ

తల్లీ !! వ్యక్తిగా నువ్వు లేని ఈ చోట..ఆత్మగా ఉన్నది నీ పాట..
అటువంటి సరస్వతీ స్వరూపమునకు ఈ భక్తుడి ద్వారా ఈ రచనాంజలి...

                                                                                      -అహం బ్రహ్మాస్మి.