Saturday, May 27, 2017

ఓ మనసా నా మనసా

విరామం నీకు తెలుసా
ఎందుకే చేస్తావు నానా రభస

నా మాటలు నీకు అలుసా
నిన్ను అర్థం చేసుకోలేదేమో నేను  బహుశా

ఓ మనసా నా మనసా

-అహం బ్రహ్మస్మి



Sunday, May 14, 2017

నడుస్తా నడుస్తా నడుస్తూనె ఉంటా
రాళ్లున్నా నీళ్లున్నా నడుస్తూనె ఉంటా
దుమ్ము పట్టిన కాళ్ళని చూడు గర్వంగా చెప్తాయ్
నేను పట్టిన పట్టు వెనక కధలన్నిటిని
కాయ కాసిన పాదాలనడుగు బిగ్గరగా చెప్తాయ్
నేను పడ్డ కష్టాన్ని ..నేను చూసిన సుఖాన్ని
నడుస్తా నడుస్తా నడుస్తూనె ఉంటా
అలలున్నా వలలున్నా నడుస్తూనె ఉంటా
బ్రతుకు బాటసారిని నేను నడుస్తూనె ఉంటా
                                                                      - అహం బ్రాహ్మాస్మి

Monday, May 1, 2017

ఆపేసాను ఆపేసాను నా కళ్ళల్లో నీళ్ళని
గట్టిగా ఊపిరి తీసుకొని ఆపేసాను
నా కన్నీళ్ళన్నిటిని
గుండెల్లో బరువుని ఉండని ఉండని
కళ్ళల్లో తడిని అలానే నిండని
అప్పుడే ప్రేమకు ప్రాణం ఉంటుంది
అప్పుడే బాధకు అర్ధం ఉంటుంది
వెళ్ళిపో నన్ను విడిచి నన్నే కాదని
అయినా ఉంటాను నిన్నే తలచుకుని...నిన్నే తలచుకుని..

Friday, April 21, 2017

ఆస్తికుడిని  కాదు నాస్తికుడిని కాదు
నేను నేనే నేను నేనే
నాయకుడిని కాదు సైనికుడిని కాదు
నేను నేనే నేను నేనే
మంచివాడిని కాదు చెడ్డవాడిని కాదు
నేను నేనే నేను నేనే

నన్ను నేనుగా చూడు .. నన్ను నేరుగా చూడు
అప్పుడే తెలుస్తుంది నేను ఎవరిననేది ..నేను  నేనే  నేను నేనే ..

                    - అహం బ్రహ్మాస్మి

Friday, April 14, 2017

నిలదియ్యరా నిన్ను  నిలదియ్యరా
నిన్ను నువ్వే ప్రశ్నించి నిలదియ్యరా
చూసీ చూడనట్టు నిన్ను చూడకురా
ధైర్యంగా నిలబెట్టి నిన్ను నిలదియ్యరా
అప్పుడే ఆగుతుంది ఈ అంతర్యుద్ధం
అప్పుడే ముగుస్తుంది ఆ బాహ్య యుద్ధం    ..ఇది తధ్యం

                                                 - అహం బ్రాహ్మాస్మి 

Saturday, April 8, 2017

ఆపెయ్  ఆపెయ్ పరుగులు ఆపెయ్
చక్కగ  నించొని చూడర  ఆపై

అపుడో  ఎపుడో కాదుర జీవితం
నేడే నేడే  నిజముర ఇది నిజం

రేపటి భయమే నేటికి సమాధి
అరెరె మరువకు అదే గతి రేపటిది

                        -అహం బ్రహ్మాస్మి 

Tuesday, March 14, 2017

గీసాం గీసాం గీతలు గీసాం
నీది నాది అని రాతలు రాసాం
ఏది ఏది ఆ నీది ఏది
అందరికీ కానిది ఎందుకు ఆ నీది
మానవత్వానికి హద్దులు లేవే
ప్రేమ తత్వానికి అడ్డులు లేవే
చెరిపేయ్ చేరిపేయ్ ఈ గీతలు చెరిపేయ్
కనిపించని సంకెళ్లను నీ కళ్ళు తెరిచి తెంపేయ్

                               -అహం బ్రహ్మాస్మి 

Sunday, February 26, 2017

ఏదో ఉన్నాం ఏదో పోయాం
చూస్తాం చూస్తాం చూస్తూ చస్తాం
కదిలించని చూపు ఎందుకు చెప్పు
కదలిరాని చేయి అది రాయి

సోదరా సోదరా శోధించరా
అక్కడా ఇక్కడా అది నువ్వేరా

స్వార్ధమై పోకు రా ఓ సోదరా
ధైర్యమై సాగరా నువ్వు మనిషిరా

                      - అహం బ్రహ్మాస్మి 

Friday, April 8, 2016

శ్రీ రామారాధన 22

మెరుపుల ముస్తాబులో నువ్వు మెరిసిపోవగా
ఆ కాంతుల కల్లాబు పై నా ఆత్మ నాట్యము చేసే

ఉగాది పచ్చడి నీ ప్రసాదమై సేవించగా
ఆ రుచుల బహువచనంలో నీ ఏకత్వం కనిపించే

రామా ..ఓ అందాల రామా ..
నీ అందము ముందు నా అహంకారము చీమ

రామా .. ఓ ఉగాది రామా ..
ఈ ఉగాది రోజు నాలో కొలువు తీరుమా ..

నా తప్పులను సరిదిద్ది ,
నిన్ను నాలొ ఉంచి ,
నా ద్వారా మంచిని పెంపొందించ కరుణించ వయా    ..శ్రీ రామా ..

         - అహం బ్రహ్మాస్మి

Saturday, January 9, 2016

శ్రీ రామారాధన 21

పరిస్థితి రాకుండానే ఆలోచన వస్తుంది

ఆ ఆలోచన కూడా చెడునే తలుస్తుంది


ఈ కలలో ఆ కలని కరిగించే కళ యేనా నీ నామము

ఇన్ని అబద్ధాలు కలిస్తే గాని గుర్తుకురాదా శ్రీ రామము
 

నీ నిజమైన నామము.. ఈ అబద్ధమైన సంసారము..
 

ఎందుకు ఆ ద్వైతము? దీనికి జవాబే కదా అద్వైతము

 

ఈ సంసారామునే నీ నామమయము చేయు సాధన ..
 

ఆ అబద్ధానికి ముందే నిజము తలచే యోచన ..నిరంతరము నీ నామస్మరణ ..

జై శ్రీరాం ..జై జై శ్రీ రామ్
                                                       -అహం బ్రహ్మాస్మి.