ఓ రామా !
ఎక్కడ చూసేది నిన్ను ..ఎలా చూసేది..
నీ కిరణాల క్రింద నిలువలేని పరిస్థితి
నీ పవనాల ఎదురుగా పయనించలేని దుస్థితి
నీ తీర్థములే కలుషితమైన వేళ
నీ ప్రసాధములే కల్తీ అయ్యాయి చాల
ఓ రామా
ఎక్కడ చూసేది నిన్ను ..ఎలా చూసేది ..
నాకు చూసే ధైర్యము లేకా ..నీకు కనబడే దయ లేకా..
నీ దయను అర్థంచేసుకొనే జ్ఞానం లేకా ..ఆ జ్ఞానాన్ని సాధన చేసే సారం లేకా ..
ఎందుకయ్యా ఇంతటి మాయ..నీ చరణాలనే పట్టుకున్నానయా.. కరుణించవయా ...శ్రీ రామయ్యా ..
జై శ్రీ రామ్ .. - అహం బ్రహ్మాస్మి