నీ మంచి మాటలతో మనిషినై పెరిగాను
నీ చల్లని చూపులతో చంచలత్వమును వదిలాను
నీ వెచ్చని వడిలో కూర్చుని లోకాన్ని నేర్చాను
నీ మెత్తని మనసులో నన్ను నేనే చూసాను
నీ ప్రేమ వరదలో నేను క్షేమంగా వున్నాను
నీ కరుణ సాగరంలో ముత్యమై మెలిగాను
వస్తువేమి ఇచ్చి నీ ఋణము తీర్చుకోగలను ??
రెండు బుగ్గల ఫై రెండు ముద్దులు తప్ప....
-నీ ముద్దుల కొడుకు
-