దైవ సమానులైన నా
తల్లిదండ్రులకు నమస్కారములు
కృతజ్ఞతలు
సృష్టికి ఆధారం సూర్యుడు అంటే కాదని చెప్పలేము కదా
అలాగే మా గురువులే మాకు
ఆధారం అంటే అతిశయోక్తి అనలేము కదా
మాకు ఆధారమై మా ధైర్యం గా నిలిచినందుకు మా గురువులందరికీ నా హృదయపూర్వక
కృతజ్ఞతలు
ఒక కవిత లో పదాలు ఎక్కువైతే దాని అందం తగ్గుతుంది
కాని జీవితంలో స్నేహితులు
ఎక్కువైతే దాని లో మకరందం పెరుగుతుంది
ఆ మకరందం యొక్క తియ్యదనాన్ని నాకు పరిచయం చేసిన మీ అందరికి నా కృతజ్ఞతలు
ప్రసాదం కదా అని పులిహోర లో పచ్చిమిరపకాయ తినలేము కదా
అలాగే బాగా మాట్లాడారుకదా అని
అందరితో స్నేహం చేసేయకూడదు
అందుకే జూనియర్స్ జాగ్రత్త..గ్రహించండి, స్నేహం చెయ్యండి
చంద్రుడి అందానికి నక్షత్రాలు తోడ్పడినట్లు
కృష్ణుడి చమత్కారానికి
పిల్లనగ్రోవి తోడైనట్లు
ఈ నాలుగేళ్ల కాలంలో నాతో నిలిచి, నన్ను మలచిన వారందరికీ నా కృతజ్ఞతలు ...
నేను ఈరోజు ఇలా ఉన్నానంటే దానికి కారణం చాలా విధాలా మా సీనియర్స్ ... వాళ్ళ
గురించి రాయడానికి నా రచనా కౌసల్యం చాలినా, ఆ అభిమానాన్ని పదాలలో పెట్టటానికి
ఇక్కడ చోటు చాలదు... అందుకే ఆకరిగా చెప్తున్నా లోతైన మనసునుంచి చెప్తున్నాను ..నా
సీనియర్స్ అందరికీ నా కృతజ్ఞతలు...
-
శ్రీరాం కొల్లూరు
Copyright©2013 sreeram kolluru .All Rights Reserved